గుజరాత్‌లో పఠాన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాధాన్‌పూర్ వద్ద ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. బస్సు ఆనంద్ నుంచి కచ్ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.