శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తిని కారు ఢీ కొట్టింది. మృతుడు కారు అద్దంలో ఇరుక్కుపోగా అలాగే ఈడ్చుకెళ్లింది. దీంతో మృతుడి తల కారు వెనకాల సీట్ లో తెగిపడింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు శంషాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.