ఒడిశాలోని బాజ్‌పుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూరీ నుంచి బెంగాల్ వెళ్తోన్న బస్తు బారావతి ఫ్లైఓవర్ దాటుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఓక్కసారిగా బస్సు వంతెనపైనుంచి కిందపడటంతో..అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కటక్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.