మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి జిల్లాలోని పరట్వాడ ధరణి రహదారిపై సెమడోహ్ సమీపంలో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 50 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.