హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొట్టడంతో 8 మంది మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. హర్యానాలోని జింద్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. యాత్రికులు కురుక్షేత్ర నుంచి రాజస్థాన్‌లోని గోగమేడీ క్షేత్రానికి వెళ్తున్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.