హైదరాబాద్ హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బస్సు కిందకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు అందులో ఉన్న విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి క్రేన్ సహాయంతో ఆటోను తొలగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నాచారం ప్రసాద్ హాస్పిటల్ లో చికిత్స పోతుందుతూ విద్యార్థిని మృతి చెందింది. విద్యార్ధిని తార్నాకలో కిమితీ కాలానికి చెందిన సాత్విక హబ్సిగూడలోని గౌతం మోడల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతునన్నది. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.