ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై డబుల్ డెక్కర్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. రాయ్‌బరేలీ నుంచి ఢిల్లీకి వెళ్తున్న బస్సు అర్ధరాత్రి 12.30గంటల సమయంలో కారును ఢీకొట్టిందని, బస్సులోని నలుగురితో సహా ఏడుగురు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. మరో 20-25 మంది ప్రయాణికులు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.