రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ కారు డివైడర్‌ను ఢీకొట్టి నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న చరణ్(19) అనే యువకుడు మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చరణ్ ఇక్ఫాయ్ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.