Homeహైదరాబాద్latest Newsఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణెలో సోమవారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img