ఇదే నిజం, కోరుట్ల : మేడిపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు దుర్మరణం చెందారు. మెట్ పల్లి కి చెందిన ఖైరుద్దీన్, అతని కొడుకు రషీదుద్దీన్ కరీంనగర్ నుంచి తండ్రిని మెట్ పల్లిలో దించేందుకు కారులో బయలు దేరారు. మేడిపల్లి సమీపంలోకి రాగానే అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.