Homeజాతీయంపబ్జీకి పోటీగా ‘ఫౌజీ‌’ని తెచ్చిన అక్ష‌య్‌

పబ్జీకి పోటీగా ‘ఫౌజీ‌’ని తెచ్చిన అక్ష‌య్‌

ముంబాయిః ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ఉద్యమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్లు సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనికి ‘ఫౌజీ(FAU-G) ’ (ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌) అని పేరుపెట్టారు. త్వరలో ఈ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇది ప‌బ్జీ త‌ర‌హ‌లో మల్టీ ప్లేయర్‌ గేమ్ అని తెల‌పారు. కేవలం వినోదమే కాదు.. మన సైనికుల త్యాగాలను తెలియజేయబోతున్నాం. ఈ గేమ్‌ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం ‘భారత్‌కా వీర్‌ ట్రస్ట్‌’కు అందజేస్తామ‌ని అక్షయ్ అన్నారు. గేమ్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుద‌ల చేశారు. దీన్ని బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్‌ గేమ్స్‌ రూపొందించిన దీనికి అక్షయ్ మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు.
దేశ ర‌క్ష‌ణ‌కు ముప్పుంద‌ని చైనాకు చెందిన ప‌బ్జీతోస‌హ 118 యాప్‌ల‌పై కేంద్రం నిషేధం విధించిన సంగ‌తి తెలిసందే. అక్షయ్‌ ‘ఫౌజీ‌’ పేరుతో పోస్టు చేసిన వెంటనే పలువురు సోష‌ల్ మీడియాలో సంతోషం వ్యక్తంచేశారు. ఆయ‌న చొర‌వ‌ను మెచ్చుకున్నారు. గేమ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. ‘బెల్‌ బోటమ్‌’ సినిమా షూటింగ్ నిమిత్తం ప్ర‌స్తుతం ఆయ‌న యూకేలో ఉన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img