Fauji : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ”ఫౌజీ” (Fauji) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ”సీతా రామం” డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ రేపు హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. రేపటి నుంచి దాదాపు రెండు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ కొనసాగనుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో సైనికుడి పాత్రను పోషిస్తున్నాడు.