Homeలైఫ్‌స్టైల్‌#jaggery : బెల్లంతోనే పండుగ‌ వంటలు.. ఉప‌యోగాలు తెలిస్తే వావ్ అనాల్సిందే

#jaggery : బెల్లంతోనే పండుగ‌ వంటలు.. ఉప‌యోగాలు తెలిస్తే వావ్ అనాల్సిందే

హైదరాబాద్ః పండుగ అంటేనే పిండివండ‌లు గుర్తొస్తాయి. ఇక ఇందులో తీపి వంటల పేర్లు వింటేనే నోరు ఊరుతుంది. బెల్లం ఉప‌యోగాలు తెలిస్తే మీరు సైతం రోజు బెల్లాన్ని రోజువారీగా తీసుకుంటారు.

అయితే స్వీట్‌తో చేసే పిండి వంట‌ల్లో ఎక్కువ‌గా బెల్లాన్ని ఉప‌యోగిస్తారు. బెల్లాన్ని చెరకు రసం నుండి తయారుచేస్తారు.

బెల్లపు రుచికి, క్షారగుణానికీ జీర్ణరసాలు ఎక్కువగా ఊరతాయి. వీటి వల్ల అంతకుముందు తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమైపోతుంది.

ఆరోగ్యపరంగా చ‌క్కెర కంటే బెల్లం శ్రేష్టమైంద‌ని ఆయూర్వేద నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.

బెల్లంలో ఉండే ఐరన్‌ వల్ల రక్తహీనత సమస్య దూరమైపోతుంది. అందుకనే గర్భిణీ స్త్రీలనీ, బాలింతలనీ బెల్లం తినమని చెబుతుంటారు.

వేసవిలో బెల్లంతో చేసిన పానకంతో కడుపు చల్లగా ఉంటుంది. కాలేయం వంటి అవయవాన్ని కూడా శుద్ధి చేసే ప్రభావం బెల్లానికి ఉంది. కీళ్ల సమస్యలకి బెల్లం ఉపశమనం కలిగిస్తుందట‌.

Recent

- Advertisment -spot_img