ఇదే నిజం, గొల్లపల్లి: అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాంబాబు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మహాత్మా జ్యోతి రావు పూలే హాస్టల్‌ను సందర్శించి, వంటగదిని పరిశీలించి, విద్యార్థుల అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండటానికి శుభ్రత పాటించి ఆరోగ్యకరమైన వంటకాన్ని నిర్వహించాలని సూచించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసినారు. అలాగే మండల కేంద్రంలో రానున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం H2H సర్వే పనులను సందర్శించి, వార్డు ఓటర్ల సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట మార్గదర్శకాలు మరియు సూచనలను జారీ చేసినారు. ఈ కార్యక్రమములో తహశీల్దార్ జమీర్, మండల ఆర్ఐ లు అనూష, జీవన్, తదితరులు పాల్గొన్నారు.