ఏపీలో నామినేటేడ్ పోస్టుల జాతర మొదలైంది. వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను చంద్రబాబు సర్కారు నియమించింది. మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులను భర్తీ చేసింది. గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేక పోయినవారికి.. పొత్తుల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి హై ప్రయార్టీ ఇచ్చింది. ఇందులో టీడీపీ– 16, జనసేన -3, బీజేపీ – 1 చొప్పున 20 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది కూటమి సర్కార్.