తెలుగు వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు అరెస్టు చేసారు. ఆమెను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేసి చెన్నై తరలించారు. ఇటీవలే చెన్నైలో జరిగిన బ్రాహ్మణ సంఘం సభలో కస్తూరి శంకర్ పాల్గొన్నరు. తమిళనాడు రాష్టంలో స్థిరపడ్డ తెలుగు వారిపై విమర్శలు చేశారు. దాంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసారు.