68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) 2023 లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి ఎంపికయ్యారు. ఉత్తమ నటుడి అవార్డు ఇద్దరిని వరించింది. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నటనకు గానూ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు సంయుక్తంగా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.