Homeహైదరాబాద్latest NewsFiltered water : మీరు ప్రతిరోజూ ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా..? మీకు ఈ సమస్య రావచ్చు.....

Filtered water : మీరు ప్రతిరోజూ ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా..? మీకు ఈ సమస్య రావచ్చు.. తస్మాత్ జాగ్రత్త

Filtered water : నేడు కాలంలో అందరూ ఫిల్టర్ చేసిన నీటిని తాగడం మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు బోరు నీరు, కుళాయి నీళ్లు వంటి సహజ నీటిని తాగే వారి సంఖ్య పడిపోయింది. చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్లను ఇంటికి తెచ్చుకుని ప్రతిరోజూ ఫిల్టర్ చేసిన నీటిని తాగుతున్నారు. కానీ ఫిల్టర్ చేసిన నీటిని తాగడం వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిల్టర్ చేసిన నీరు మెగ్నీషియం లోపానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ఈ లోపం మానవ నాడీ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇంకా, డయాబెటిస్ ఇస్కీమిక్ స్ట్రోక్‌కు దారితీస్తుంది. సహజ నీటిలో పది నుండి 20% మెగ్నీషియం ఉంటుంది. అయితే, ఇజ్రాయెల్ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో నేడు ఉపయోగించే ”మినరల్ వాటర్”లోని అన్ని ఖనిజాలు ఉండవని తేలింది. దీని కారణంగా, ప్రజలుకి నీటి ద్వారా మెగ్నీషియం లభించదు. కానీ నిపుణులు ఫిల్టర్ చేసిన నీరు తాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి అని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img