ఇదే నిజం ముస్తాబాద్ మండల మండల కేంద్రానికి చెందిన పర్స రాజు ఇటీవల ఆరోగ్యంతో మృతిచెందగా వారికి ఇద్దరు కూతుళ్లకు సుదీక్షణ, శ్రీయన్ష్ .లకు ప్రభుత్వ పాఠశాల మిత్రులు కలిసి 20 వేల రూపాయలను వారి కూతురుల పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబీకులకు ఆ బాండ్ లతో పాటు 4 వేల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో శీలం స్వామి, చింతోజు అమర్, వట్టెల రమేష్, సందుపట్ల శ్రీనివాస్, మాచర్ల శేఖర్, మిడిదొడ్డి బాలయ్య, అనమేని నర్సింలు, ఎస్కే దస్తగిరి, కొమ్మాట సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.