Homeహైదరాబాద్latest Newsfire accident : అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8వ అంతస్తు నుంచి దూకిన కుటుంబం.....

fire accident : అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8వ అంతస్తు నుంచి దూకిన కుటుంబం.. వీడియో వైరల్..!!

fire accident : దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన ద్వారక సెక్టార్-13లోని శపథ సొసైటీలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని ఎనిమిది మరియు తొమ్మిది అంతస్తుల్లో మంటలు వేగంగా వ్యాపించడంతో, పలువురు నివాసితులు ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

ఈ ప్రమాదంలో 35 ఏళ్ల యష్ యాదవ్ మరియు అతని ఇద్దరు పదేళ్ల చిన్నారులు బాల్కనీ నుంచి కిందకు దూకి తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ముగ్గురూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మంటలు చెలరేగడంతో కొందరు నివాసితులు అపార్ట్‌మెంట్‌లో చిక్కుకుపోయినట్లు సమాచారం. పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాద కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు, అయితే ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర సాంకేతిక లోపాలు కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Recent

- Advertisment -spot_img