అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కీలక ఫైల్స్ అగ్ని ప్రమాదంలో దగ్దం అయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందు జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్ని ప్రమాదమా, కుట్ర పూరితమా అనే అంశంలో విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.