Homeహైదరాబాద్latest Newsమలక్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌లు దగ్ధం..!

మలక్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌లు దగ్ధం..!

హైదరాబాద్‌ మలక్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ దగ్గర అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రోస్టేషన్‌ కింద పార్క్‌ చేసిన బైక్‌లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఐదు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. మలక్‌పేట-దిల్‌సుఖ్‌నగర్‌ రోడ్డుపై వెళ్లే వాహనదారులు మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img