ఇదే నిజం, జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని ఓ గృహమునందు సిలిండర్ లీకై తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. వంట చేసేందుకు గ్యాస్ స్టౌవ్ ను అగ్గిపుల్ల ద్వార వెలిగించడంతో ప్రమాదావశాత్తు సిలిండర్ ద్వారా గ్యాస్ లికై మంటలు అంటుకున్నారు. సిలిండర్ గ్యాస్ ద్వార వెలువడిన మంటలు పూర్తిగా అదుపుతప్పి ఇంటిలోని సామాగ్రి కాలీ బుడిదయ్యాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికిని అప్పటికే గృహంలోని వస్తువులని పూర్తిగా కాలిపోయాయి. అదృష్టవశాత్తు ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు. అగ్ని ప్రమాదంపై ఇంటి ఓనర్ అబ్దుల్ నహీం ను వివరణ కోరగా ఉదయం వంట చేసుకుందామని పొయ్యి వెలిగించడంతో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి ఇల్లంతా మంటలు అంటుకున్నాయని తెలిపారు. అలాగే పొలం అమ్మడం ద్వారా వచ్చిన రూ. 1 లక్ష, ఒక తులం బంగారం పూర్తిగా కాలిపోయాయని సుమారు నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తెలియజేశారు. ఈ విషయంపై అధికారులు బాధితుల నుంచి స్టేట్మేంట్ తీసుకున్నారు.