Homeక్రైంFire in London airport car park లండన్​ ఎయిర్​పోర్టు కారు పార్కింగ్​లో అగ్ని ప్రమాదం

Fire in London airport car park లండన్​ ఎయిర్​పోర్టు కారు పార్కింగ్​లో అగ్ని ప్రమాదం

– విమానాల రాకపోకలను నిలిపివేసి ఎయిర్ పోర్టు అధికారులు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: లండన్‌ లోని లూటన్‌ ఎయిర్​పోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వెల్లడించారు. ఎయిర్​పోర్టు పరిధిలో ఉన్న కార్‌ పార్కింగ్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో దాదాపు 1,200 వాహనాలు నిలిచి ఉన్నాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో సమీప ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించింది. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని లూటాన్‌ ఎయిర్‌పోర్ట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. పొగ పీల్చి అస్వస్థతకు గురైన కొందరు సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పార్కింగ్‌ భవనం దెబ్బతింది. ఈ ప్రమాదం కారణంగా ప్రయాణికులు, సిబ్బంది భద్రత మేరకు బుధవారం విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, మంటలు చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఫ్లైట్​లను నిలిపివేయడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img