Homeఅంతర్జాతీయంవైట్​హైస్​ వద్ద కాల్పులు

వైట్​హైస్​ వద్ద కాల్పులు

న్యూయార్క్​ : అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కాల్పుల కలకలం సృష్టించాయి. సోమవారం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ గార్డ్స్ ట్రంప్ ను కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అలాగే కాల్పులకు పాల్పడ్డ గుర్తుతెలియని దుండగులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు దుండగుడి పట్టుకునేందుకు ప్రయత్నించామని అతడు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరిపినట్టు అతను తీవ్రంగా గాయపడినట్లు వైట్ హౌస్ భద్రత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. వైట్‌హౌజ్‌ బయట కాల్పుల శబ్ధం వినిపించగానే విలేకరుల సమావేశాన్ని మధ్యలోనే ఆపేసిన ట్రంప్ దాదాపు 10 నిమిషాల తర్వత తిరిగి విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైట్‌హౌజ్‌ పరిసరాల్లో ఆయుధంతో సంచరిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించిన ఓ వ్యక్తిపై సీక్రెట్‌ సర్వీసెస్‌ గార్డ్స్‌ కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఘటన చోటు చేసుకోగానే సత్వరం స్పందించిన భద్రతా సిబ్బందిపై ప్రెసిడెంట్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img