Homeసినిమాఆకట్టుకుంటున్న అల్లరోడి ఫస్ట్ గ్లింప్స్..

ఆకట్టుకుంటున్న అల్లరోడి ఫస్ట్ గ్లింప్స్..

కింగ్ నాగార్జున హీరోగా, విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్​టైనర్ ‘నా సామిరంగ’. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 14న గ్రాండ్​ రిలీజ్​కు ఈ మూవీ రెడీ అవుతోంది. ఈ సినిమాలో అల్లరి నరేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీలో అల్లరి నరేష్ అంజి పాత్రలో ఆడియెన్స్​ను అలరించనున్నారు. ఈ క్యారెక్టర్​కు సంబంధించిన ఇంట్రో గ్లింప్స్​ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు. వీడియోలో అల్లరి నరేష్ సూపర్ ఎనర్జి టిక్​గా కనిపిస్తున్నారు. నాగార్జునతో ఉన్న సన్నివేశాలు చాలా బాగున్నాయి. మరోసారి అల్లరి నరేష్ తనదైన మార్క్ ను ఈ అంజి పాత్రతో వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్​పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆషికా రంగనాథ్ హీరోయిన్​గా నటిస్తోంది.

Recent

- Advertisment -spot_img