ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు పల్లె పండుగ వారోత్సవాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ వారోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, అది మన బాధ్యత అని, ఆ తర్వాత సినిమాలు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. అంతే కాకుండా సినిమాకి వెళ్లాలంటే రోడ్లు బాగుండాలని, ముందుగా వాటిని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తాం అని తెలిపారు. నేను టాలీవుడ్‌లో ఎవరితోనూ పోటీపడను, సినిమా చేయాలంటే నా దగ్గర డబ్బు ఉండాలి. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటా.. సినిమా పరిశ్రమ బాగుండాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. ముందుగా రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఆ తర్వాత విందులు, వినోదాలు చేస్తాం” అన్నారు.
అలాగే సినిమా అంటే నాకు చాలా గౌరవం, ప్రేమ. ఏ హీరోపైనా నాకు ఎలాంటి విభేదాలు లేవు.బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని, రామ్ చరణ్ ఇలా హీరోలందరినీ నేను గౌరవిస్తాను. అయితే సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ముందుగా రాష్ట్రాభివృద్ధి అవసరమని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.