HomeతెలంగాణFirst list of BJP candidates? బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ అప్పుడే?

First list of BJP candidates? బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ అప్పుడే?

– ఈ నెల 15 లేదా 16న ప్రకటించే అవకాశం

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరుకుంది. ఏకాభిప్రాయం ఉన్న 40మందితో కూడిన జాబితాను రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానానికి పంపించింది. అమావాస్య తర్వాత ఈ నెల 15 లేదా 16న 38మందితో కూడిన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఏకాభిప్రాయం రాని మిగతా స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది. మొత్తం 3 జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనుంది.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అగ్రనేతలతో ఒక దఫా ప్రచారం పూర్తి చేయాలని భావించిన కమలం పార్టీ 3 రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోడీని రెండుసార్లు రాష్ట్రానికి రప్పించింది. పాలమూరు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన మోడీ.. నిజామాబాద్‌ గడ్డ నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈనెల 10న ఆదిలాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఆదిలాబాద్‌ జనగర్జన సభ పేరుతో నిర్వహించే సభలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం ఆదిలాబాద్‌ సభ తర్వాత సాయంత్రం రాజేంద్రనగర్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెప్పినప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

Recent

- Advertisment -spot_img