Homeహైదరాబాద్latest Newsబిగ్‌బాస్ సీజన్ 8 'విన్నర్' ఎవరో ఫిక్స్.. టాప్ లో ఉంది ఎవరంటే?

బిగ్‌బాస్ సీజన్ 8 ‘విన్నర్’ ఎవరో ఫిక్స్.. టాప్ లో ఉంది ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం హౌసులో ప్రస్తుతం అవినాష్, గౌతమ్ , నిఖిల్ , నబీల్ అఫ్రిది, ప్రేరణ కంబం ఉన్నారు. ఈ సీజన్ టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఈ రాత్రికి టైటిల్ విన్నర్ ఎవరన్నది లీక్ అవుతుంది.అయితే నిన్న అర్థ రాత్రి 12 గంటలకు టైటిల్ విన్నర్ ఓటింగ్ ముగిసింది. సోషల్ మీడియా ఓటింగ్స్ ప్రకారం చూస్తే నిఖిల్ యూట్యూబ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, రెండవ స్థానంలో గౌతమ్ కొనసాగుతున్నాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు వెబ్‌సైట్ పోల్స్‌లో కూడా గౌతమ్ లీడ్ లో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే నిఖిల్, గౌతమ్ మధ్య అఫీషియల్ ఓటింగ్ నువ్వా నేనా అనే రేంజ్ లో జరిగింది. అయితే ఫీషియల్ ఓటింగ్ లీక్ ప్రకారం.. నిఖిల్‌పై గౌతమ్ 0.03 శాతం ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నాడని, గౌతమ్ టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. అయితే ఓటింగ్ ముగిసే సమయానికి ఇద్దరిలో ఒకరి వైపు గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img