Homeతెలంగాణflood:వరద బాధితుల గోడు పట్టదా?

flood:వరద బాధితుల గోడు పట్టదా?









వరద బాధితుల గోడు పట్టదా?

  • ముందస్తు చర్యలు తీసుకోవడంలో సర్కారు ఫెయిల్
  • సాగునీటి ప్రాజెక్టులు గాలికి వదిలేశారు
  • గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క

ఇదేనిజం, స్టేట్ బ్యూరో: వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని చెప్పారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య తదితరులతో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. వరద అనంతరం సహాయక కార్యక్రమాలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ప్రజల కోసం పనిచేయాల్సిన యంత్రాంగాన్ని రాజకీయం కోసం వాడుతున్నారు. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులన్నీ ప్రజల ఆస్తులేనని చెప్పారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం ఎటువంటి పరిహారం అందించలేదని వాపోయారు.

Recent

- Advertisment -spot_img