భారీ వర్షాలకు నదుల్లో ఉండాల్సిన మూగజీవాలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల మొసళ్లు గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఘటనలు అనేకం చూశాం. అలాంటి ఘటనే గుజరాత్ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంది. సౌరాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వడోదరలోని విశ్వామిత్ర నది నుంచి భారీగా మొసళ్లు జనావాసాల్లోకి కొట్టుకొచ్చాయి.