ఖమ్మంలో వరదలు కల్లోలం సృష్టించాయి. భారీ వర్షాలతో మున్నేరు పొంగి పొర్లడంతో ఖమ్మం వాసులు విలవిల్లాడిపోయారు. పునరావాస కేంద్రాల్లో 5 వేల మంది బాధితులు తలదాచుకున్నారు. నాలుగు రోజులుగా ముంపు కాలనీలు అంధకారంలోనే ఉన్నాయి. యుద్ధప్రాతిపదికన ముంపు కాలనీల్లో సహాయ చర్యలు ప్రభుత్వం ప్రారంభించింది.