Homeతెలంగాణfloods:వద్దంటున్న వినలే..

floods:వద్దంటున్న వినలే..

floods

వద్దంటున్న వినలే..

  • కొట్టుకుపోయిన కారు..

floods: ఇదేనిజం, సిద్దిపేట: ప్రవాహం ఎక్కువగా ఉందని చెబుతున్నా వినకుండా ఓ కారు డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి శివారులోని వాగులో చోటు చేసుకున్నది. అక్కెనపల్లి-బస్వాపూర్‌ మార్గంలో పెద్దవాగుపై కాజ్‌వే ఉంది. భారీ వర్షాలతో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండు రోజులుగా రాకపోకలు నిలిచాయి. గత రాత్రి ఓ కారు పోరెడ్డిపల్లి నుంచి అప్పిసకాలనీ మీదుగా అక్కెనపల్లి మార్గంలో ప్రయాణించింది. అందులో డ్రైవర్‌ ఒక్కడే ఉన్నారు. ప్రవాహం అధికంగా ఉందని, కాజ్‌వేపై వెళ్లొద్దని స్థానికులు వారిస్తున్నా ఆయన వినకుండా ముందుకెళ్లారు. అయితే… కారు కొట్టుకుపోయింది. ప్రస్తుతం రెస్క్యూ టీమ్ ఈ కారు కోసం గాలిస్తోంది.

Recent

- Advertisment -spot_img