భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో సినీప్రముఖులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అలాగే.. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ సైతం తనకు తోచినంత రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తం అందించనున్నట్టు వెల్లడించారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్దతుగా ఈ విరాళం ఇస్తున్నానని తెలిపారు. తన అభిమాన హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన కాసేపటికే విశ్వక్‌సేన్ ఈ ప్రకటన చేశారు.