దేశంలో టిక్‌టాక్‌తో చాలా మంది యువతకు తమ ప్రతిభను ప్రపంచానికి చూపేందుకు అవకాశం దొరికింది. అయితే కొంత మంది టిక్‌టాక్ వేధికగా లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. టాలివుడ్లో పలువురు హీరోయిన్ల కంటే ఈ టిక్‌టాక్ స్టార్స్‌కే సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారంటే చెప్పొచ్చు వాళ్ళకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో. ఇక అలాంటి వాళ్ళలోనే దీపిక పిల్లి కూడా ఒకరు. ఈ అమ్మాయికి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. టిక్‌టాక్ లేకున్నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాద్యమాల్లో ఈ అమ్మాయికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. రోజు రోజుకు వేలల్లో ఈమెకు ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. దీంతో పాటు ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు నిమిషాల్లో యామై వేలకు పైగా లైక్స్ వచ్చిపడుతున్నాయి. ఇక టిక్‌టాక్ మ్యాన్ అయ్యే నాటికి దీపిక టిక్‌టాక్ ఫాలోవర్స్ ఏకంగా 8 మిలియన్లు(80 లక్షలు).