వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో అన్నదాన కేంద్రం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రూ.35.25 కోట్ల నిధులను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్, VTDA విజ్ఞప్తితో సీఎం కార్యాలయం స్పందించి ఈ నిధులు కేటాయించింది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.