Homeలైఫ్‌స్టైల్‌అందాన్నిచ్చే ఆహారం

అందాన్నిచ్చే ఆహారం

ఆహారంతో ఆరోగ్యమే కాదు అందాన్ని పెంచుకోవచ్చు.

ఆహారం ద్వారా లభించే పోషకాలు చర్మాన్ని లోపల నుంచి తళుక్కుమనేలా చేస్తాయి.

చలికాలంలోనూ మృదువైన చర్మం సొంతం కావాలంటే ఏమేం తినాలో చెబుతున్నారు చర్మనిపుణులు.

ఈ సీజన్‌లో చర్మసంరక్షణ కోసం వారు సూచించిన స‌ల‌హాలు మీ కోసం..

బాదం

బాదం రోజు తీసుకోవ‌డం ద్వారా చర్మానికి తేమ అందుతుంది. దీంతోపాటు చ‌ర్మం పొడిబారకుండా ఉంటుంది.

బాదంలో సమృద్ధిగా లభించే విటమిన్‌ ఇ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

గ్రీన్‌ టీ

యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన గ్రీన్‌ టీ ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. దీంతో చర్మం కాంతిమంతమై మెరుపు వ‌స్తుంది.

ఇదే కాకుండా చ‌ర్మంపై వ‌చ్చే ముడతలు, గీతలను మాయం చేయండంలో దొహ‌ద ప‌డుతుంది.

క్యారెట్లు

క్యారెట్‌లో విటమిన్‌ సి ఎక్కువగా ల‌భిస్తోంది. ఇది కొల్లాజెన్‌ ప్రొటీన్‌ తయారీకి ఉపయోగపడుతుంది.

చర్మాన్ని దృఢంగా, వదులుగా మార్చ‌డంలో కొల్లాజెన్‌ ప్రొటీన్ ప్ర‌ముఖ పాత్ర పొషిస్తోంద‌ని చ‌ర్మ నిపుణులు చెబుతున్నారు.

అవకాడో

ఇందులో ఆరోగ్యకరమైన నూనెలు, విటమిన్‌ ఇ రెండూ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

ఇవి చర్మ కణాలు సమర్థంగా పనిచేసేందుకు దోహదపడతాయి.

పాలకూర

మెరిసే చర్మం కావాలనుకుంటే పాలకూరను ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

ఇందులో విటమిన్‌ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అన్ని రకాల స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి.

పాల‌కూర‌లో ఉండే ఐరన్‌ రక్తహీనతను నివారించి, పాలిపోయిన చర్మానికి రంగునిస్తుంది.

Recent

- Advertisment -spot_img