ఇదేనిజం, శేరిలింగంపల్లి: చందానగర్ లోని మహిళా దక్షిత సమితి బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సుమన్ హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చందా నగర్ పోలీస్ పోలిస్ స్టేషను పరిధిలో జరిగింది. ఆలస్యంగా తెలిసిన వివరాల ప్రకారం ఆదివారం హాస్టల్లో ఆహారం తీసుకున్న 50 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయినట్టు తెలుస్తోంది. వెంటనే హాస్టల్ యాజమాన్యం వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ 50 మంది విద్యార్థుల్లో ప్రస్తుతం ఆరుగురు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయంపై కాలేజీయాజమాన్యాన్ని వివరణ కోరగా.. మా దగ్గర ఎవరికీ ఫుడ్ పాయిజన్ కాలేదని, మంజీరా నీటి సరఫరాలో కల్తీ నీరు సరఫరా కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు హాస్టల్ యాజమాన్యం తెలపడం గమనార్హం.