వికారాబాద్ జిల్లా నస్కల్‌లో కస్తూర్భా పాఠశాలలో 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. రాత్రి భోజనంలోకి విద్యార్థినులకు పప్పు, అన్నం, ఆలు కర్రీ వడ్డించారు. ఆహారం తిన్న అనంతరం విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులతో విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవుతుండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.