Homeఫ్లాష్ ఫ్లాష్Food to avoid on an empty stomach : ఖాళీ క‌డుపుతో వీటిని తిన్నారంటే...

Food to avoid on an empty stomach : ఖాళీ క‌డుపుతో వీటిని తిన్నారంటే అంతే ఇక‌..

Food to avoid on an empty stomach : రోజంతా ఏం చేసినా న‌డుస్తుంది.. ఏం తిన్నా ప‌ర్వాలేదు కానీ.. ఉద‌యం లేవ‌గానే కొంద‌రు చేసే చిన్న మిస్టేక్స్ వ‌ల్ల‌.. వాళ్ల జీవిత‌మే అంధ‌కారం అవుతుంది.

కోరి రోగాల‌ను తెచ్చుకున్న‌వాళ్లు అవుతారు. ఆరోగ్యాన్ని పాడుచేసుకున్న‌వాళ్లు అవుతారు.

ఉద‌యం లేవ‌గానే క‌డుపు ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే.. రాత్రి ప‌డుకునే ముందు ఆహారం తీసుకున్నా.. ఉద‌యం లేచేవ‌ర‌కు క‌డుపులో ఉన్న ఆహారం అరిగిపోతుంది.

అంటే క‌నీసం 8 గంట‌ల నుంచి క‌డుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి స‌మ‌యంలో శ‌రీరం లోప‌ల చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.

ఆ స‌మ‌యంలో తీసుకునే ఆహారంలో చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఏమాత్రం అశ్ర‌ద్ధ చేసినా.. అనారోగ్యానికి గుర‌యిన‌ట్టే.

ఉద‌యం లేవ‌గానే.. ఖాళీ క‌డుపుతో.. లేదా ప‌రిగ‌డుపున ఏం తిన‌కూడ‌దో చాలామందికి తెలియ‌దు. ఏది ప‌డితే అది తినేస్తుంటారు. తాగేస్తుంటారు.

అస‌లు.. ఉద‌యం లేవ‌గానే ఏం తిన‌కూడ‌దు.. ఏం తాగ‌కూడ‌దు.. అనే విష‌యాల‌ను సెల‌బ్రిటీ న్యూట్రిష‌నిస్ట్ పూజా మ‌ఖిజా త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. అవేంటో తెలుసుకుందాం రండి.

కాఫీ – Caffeine

అతి ముఖ్య‌మైన‌ది కాఫీ. ఎందుకంటే.. ఉద‌యం లేవ‌గానే చాలామంది చేసే ప‌ని ఇదే. లేవ‌గానే.. కాఫీ.. అని అరుస్తుంటారు.

దీంతో ఇంట్లో ఉన్న‌వాళ్లు.. వాళ్ల‌కు బెడ్ మీదే కాఫీ అందిస్తారు. అది తాగితే కానీ.. వాళ్ల ప‌నులు మొద‌ల‌వ్వ‌వు.

దానికే బెడ్ కాఫీ అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఖాళీ క‌డుపుతో కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా? అసిడిటీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

అసిడిటీ వ‌ల్ల‌.. హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావం ప్రేరేపితం అయి చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

తిన్న‌ది అర‌గ‌క‌పోవ‌డం, చాతిలో నొప్పి రావ‌డంతో పాటు ఇంకా చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుకే.. ఖాళీ క‌డుపుతో కాఫీ తాగ‌డం ఎంత త్వ‌ర‌గా మానేస్తే అంత బెట‌ర్‌.

ఆల్కాహాల్ – Alcohol

చాలామందికి ఇష్ట‌మైన డ్రింక్ ఇది. కానీ.. దీన్ని ఎప్పుడు తీసుకోవాలో అప్పుడే తీసుకోవాలి.

ఖాళీ క‌డుపుతో మ‌ద్యాన్ని తీసుకుంటే ఆల్కాహాల్ నేరుగా ర‌క్తంలో క‌లిసిపోతుంది. దాని ద్వారా శ‌రీరంలో మొత్తానికి ఆల్కాహాల్ వ్యాపిస్తుంది.

దాని వ‌ల్ల ర‌క్తంలోని ర‌క్త‌నాళాలు ఎఫెక్ట్ అయి ప‌ల్స్ రేట్‌, బీపీ ఒక్క‌సారిగా ప‌డిపోతుంది.

అలాగే.. ఆల్కాహాల్‌.. ర‌క్తం ద్వారా కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివ‌ర్.. అటునుంచి మెద‌డుకు కూడా చేరుతుంది.

ఇది దీర్ఘ‌కాలంలో చాలా స‌మ‌స్య‌ల‌ను తీసుకొస్తుంది.

ఒక‌వేళ ఏదైనా ఆహారం తీసుకొని ఆల్కాహాల్ తీసుకుంటే.. ర‌క్తంలో పూర్తిస్థాయిలో ఆల్కాహాల్ క‌ల‌వ‌కుండా.. నివారించ‌వ‌చ్చు.

దాని వ‌ల్ల‌.. త‌క్కువ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

చూయింగ్ గ‌మ్ – Chewing gum

చాలామందికి చూయింగ్ గ‌మ్ అంటే చాలా ఇష్టం. కాక‌పోతే దాన్ని ఖాళీ క‌డుపుతో న‌మ‌ల‌కూడ‌దు.

నిజానికి గ‌మ్‌ను న‌మ‌ల‌డం వ‌ల్ల‌.. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఆమ్లాలు విడుద‌ల‌వుతాయి. అవి.. జీర్ణాశ‌యంలో ఉన్న ఆహారాన్ని అర‌గ‌దీస్తాయి.

ఖాళీ క‌డుపుతో గ‌మ్ న‌మిలితే.. జీర్ణాశ‌యంలో ఎటువంటి ఆహారం ఉండ‌దు కాబ‌ట్టి.. గ‌మ్ న‌మ‌ల‌డం వ‌ల్ల విడుద‌లైన ఆమ్లాలు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తాయి.

దాని వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Non-steroidal anti-inflammatory drugs

ఖాళీ క‌డుపుతో ఉన్న‌ప్పుడు Non-steroidal anti-inflammatory drugs ను అస్స‌లు తీసుకోవ‌ద్దు.

పెయిన్ కిల్ల‌ర్స్‌, జ్వ‌రం త‌గ్గించే మెడిసిన్ లాంటివి ఈ కేట‌గిరీ కిందికే వ‌స్తాయి.

వీటిని ఖాళీ క‌డుపుతో అస్స‌లు వేసుకోవ‌ద్దు.

ఏదైనా తిన్నాకే ఈ మెడిసిన్‌ను వేసుకోవాలి.

ఖాళీ క‌డుపున ఈ మెడిసిన్స్ వేసుకుంటే.. క‌డుపులో తిప్పిన‌ట్టుగా అవ‌డం, వాంతులు, వికారం అయ్యే ప్ర‌మాదం ఉంటుంద‌ట‌.

అలాగే.. మెడిసిన్స్ ప‌డ‌క నోటిలో, క‌డుపులో పుండ్లు అవుతాయ‌ని న్యూట్రిష‌నిస్ట్ పూజ స్ప‌ష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img