Homeఫ్లాష్ ఫ్లాష్Late night Hungry : అర్ధ‌రాత్రి ఆక‌లేస్తుందా.. అయితే ఇవి తినండి..

Late night Hungry : అర్ధ‌రాత్రి ఆక‌లేస్తుందా.. అయితే ఇవి తినండి..

Food to eat Late night Hungry : అర్ధ‌రాత్రి ఆక‌లేస్తుందా.. అయితే ఇవి తినండి..

రాత్రి ఎనిమిది గంటలకే భోంచేసి, తొమ్మిదింటికంతా నిద్రపోవడం దాదాపుగా అసాధ్యమైపోయింది ఈ రోజుల్లో.

అర్ధరాత్రి వరకూ టీవీలు, స్మార్ట్‌ఫోన్లలో మునిగిపోతున్నారు. మధ్యలో ఆకలేస్తే ఏదిపడితే అది తింటున్నారు.

ఫలితంగా, ఊబకాయం బారినపడుతున్నారు. ఆ తినేదేదో ఆరోగ్యవంతమైనదే తినమని సలహా ఇస్తున్నారు నిపుణులు.

బెర్రీ పండ్లు :

ఇందులో పీచుపదార్థం ఎక్కువ. బెర్రీలోని మెగ్నీషియం నరాలు, కండరాలను త్వరగా విశ్రాంతపరుస్తుంది

‘చిరు’ రుచులు :

గోధుమలు, చిరుధాన్యాలతో (తక్కువ ఉప్పుతో) చేసిన అప్పాలు, మురుకులు.

క్యారెట్‌ :

కరకరమనే క్యారెట్‌ తింటూ టైమ్‌పాస్‌ చేయడంవల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తాజా క్యారెట్లలో తక్కువ క్యాలరీలు ఉంటాయి.

పాప్‌కార్న్‌ :

రాత్రిళ్లు (ఉప్పు లేకుండా) ఆలివ్‌ ఆయిల్‌లో వేయించిన పాప్‌కార్న్‌ తినడంవల్ల నష్టం లేదు.

పుట్నాలు :

క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే పుట్నాలను స్నాక్స్‌గా ఎంచుకోవచ్చు. వీటిలో ప్రొటీన్‌, ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలం.

Recent

- Advertisment -spot_img