Homeఎడిటోరియల్​అన్నమోదిక్కు... ఆకలోదిక్కు...!!

అన్నమోదిక్కు… ఆకలోదిక్కు…!!

  • హైద‌రాబాద్ మ‌హా నగరంలో భారీగా వృధా అవుతున్న ఆహారం
  • మొత్తం రాష్ట్రంలోని పేద‌ల ఆక‌లి తీర్చ‌గ‌గిగే ఆహారం వృధా
  • దాదాపు 8 వందల మెట్రిక్‌ టన్నుల ఆహారం వ్యర్ధం
  • 20 లక్షల మంది ఆకలి తీర్చే కూడు నేలపాలు
  • వేడుకల్లో 35 నుండి 40 శాతం వృధా
  • హోటళ్ళలో 20 శాతం వృధా
  • ప్రభుత్వ హాస్టళ్ళలో 30 శాతం
  • ప్రైవేటు హాస్టళ్ళలో 15 నుండి 20 శాతం

హైద‌రాబాద్ మ‌హా నగరంలో ఓ వైపు తినబోతే తిండి లేక అన్నమోరామచంద్రా అని చాలా మంది నిత్యం కడుపు కాలుతూ కష్టపడుతుంటే… మరోవైపు తిండి ఉక్కువై తిన్నది అరగక లక్షల మందికి అందాల్సిన‌ ఆహారిన్ని వృధా చేస్తున్నారు.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. అన్నిటికన్నా మహాధానం అన్నధానం అని చాలా సార్లు వినే ఉంటాము.

ఏ మతమైనా అన్నధానంపై ఏదో ఒక సందర్బంలో ఆన్నధానం ప్రాదాన్యతను తెలుపుతూ తమ మత గ్రంధాలలో సైతం పేర్కొన్న సందర్బాలున్నాయి.

అటువంటి అహారం ఎంతో మంది ఆకలి తీర్చాల్సిన అన్నం నేడు భారీగా వృధాగా నేలపాలు అవుతుంది. జీహెచ్‌ఎమ్సీ లెక్కల ప్రకారం నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్త దాదాపు రోజుకు 5280 మెట్రిక్‌ టన్నులు.

ఇందులో దాదాపు 15 శాతం ఆహార వ్యర్ధాలు ఉన్నట్లు ఓ అంచనా. అంటే మొత్తం చెత్తలో దాదాపు 8 వందల మెట్రిక్‌ టన్నుల ఆహార వ్యర్ధాలు ఉన్నాయి.

ప్రతీ రోజు సగటున నగరంలో 8 వందల మెట్రిక్‌ టన్నుల ఆహారం అభాగ్యుల కడుపులోకి వెళ్లకుండా వృధాగా చెత్తలో కలుస్తుంది.

జీహెచ్‌ఎమ్సీ నిత్యం అనేక రకాలుగా సేకరిస్తున్న చెత్తలో ఇంత భారీ మొత్తంలో ఆహార పధార్థాలు వృధా  అవుతున్నాయి.

ఈ వృధా అవుతున్న ఆహారాన్ని గనుక వృధా కాకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుని ఆహారం దొరకని ఇతరులకు పంచితే ఆ మిగిలే ఆహారంతో దాదాపు మరో 20 లక్షల మందికి ఒక పూట ఆహారాన్ని అందించే అవకాశముంది.

కానీ నేడు అనేక మంది నిర్లక్ష్యంతో ఆ ఆహారమంతా నేలపాలు అవుతుంది.

ప్రస్తుతం వృధా అవుతున్న ఆహారం విలువ అంచనా వేస్తే ఒకరికి ఒక్క పూట బోజనానికి తక్కువలో తక్కువ రూ.30 అనుకున్నా మొత్తం వృధా అవుతున్న ఆహారం విలువ అక్షరాలా రోజుకు రూ.6 కోట్ల విలువ, నెలకు రూ.180 కోట్లు, ఇలా సంవత్సరానికి నగరంలో వృధా అవుతున్న ఆహారం విలువ దాదాపు రూ.2160 కోట్ల కూపాయలు ఉంటుంది.

ఇలా వృధా అవుతున్న ఆహారంలో వేడుకలు, ఫంక్షన్‌ హాల్‌లలో వృధా అవుతున్న ఆహారం దాదాపు 30 నుండి 40 శాతం వరకూ ఉంది. దీనికి కారణం వేడుకల్లో తమ వైభవాన్ని చూపేందుకు నేటి నగర జనాలు పోటీగా ఖర్చు చేస్తున్నారు.

దేనికీ వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతో అవసరానికి మించి వంటతో పాటు రకరకాల వంటకాలతో, స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలు అంటూ దాదాపు ఒక్కొక్కరి ప్లేట్లో కనీసం 5 నుండి 20 రకాల రుచులను చూపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో అనేక మంది ఆహ్వానితులు చాలా రకాల ఆహార పధార్థాలను కేవలం రుచి చూసి చాలా వరకూ పడేస్తున్నారు.

అంతే కాకుండా అంచనాకు వంద మంది ఆహ్వానితులు ఉన్నారనుకుంటే అదనంగా మరో 50 మందికి వంటలు సిద్దం చేస్తున్నారు నిర్వాహకులు.

అయితే ఫంక్షన్‌ హాళ్ళలో ఎక్కువగా వేడుకలు జరగడం వల్ల వారు తిరిగి మిగిలిన ఆహారాన్ని తమ బందువులకు తరువాత పూటకు అందించలేక పడేయాల్సిన పరిస్థితి.

అదే ఇళ్ళలో అయితే కనీసం కొన్ని సార్లు అయినా మిగిలిన ఆహారాన్ని తరువాత పూటకు తినేందుకు వినియోగిస్తారు. కానీ ఈ అవకాశం ఇక్కడ లేకుండా పోయింది.

ఇక నగరంలో ఉన్న దాదాపు 25 వేలకు పైగా చిన్నా పెద్ద హోటళ్ళలో 20 శాతానికి పైగా ఆహారం వృధా అవుతుంది.

హోటళ్ళకు వచ్చిన వారు తమకు తక్కువ ఆకలి ఉన్నా తాము ఆర్డర్‌ చేసిన ఆహారం ఒకే స్థాయిలో రావడంతో మిగిలిన ఆహారాన్ని వదిలేస్తున్నారు.

అంతే కాక హోటల్‌ యాజమాన్యం కూడా తమ వద్ద మిగిలిన ఆహారాన్ని పడేస్తున్నారు. ఇక ఓయూ వంటి కాలేజీ అనుభంద హాస్టళ్ళలో 30 శాతం వరకూ, ప్రైవేటు హాస్టళ్ళలో 15 నుండి 20 శాతం వరకూ ఆహారం వృధా అవుతుంది.

ఆహార వృధా నేరమే…

నా డబ్బుతో నేను ఆహారం కొనుక్కుని తింటున్నా మిగిలింది పడేస్తే ఇందులో నేరమేముంది అని చాలా మంది అనుకుంటున్నారు.

కానీ తాము డబ్బు పెట్టి కొంటున్న ఆహారం మిగిలితే తాము కొనాల్సిన ఆహార ముడి పదార్థాల మోతాదు తరువాత సారికి తగ్గుతుంది.

అలా లక్షల మంది తమ వృధాను తగ్గించుకుంటే ఎక్కువ ధర ఉన్న నిత్యావసరాలు తక్కువ ధరకు పేద ప్రజలకు అందుతాయి.

ఉధాహరణకు ఎక్కువగా ధనికులు తినే రకం బియ్యం కూడా భూస్వాములు మాత్రమే పండిస్తున్నారు. పేద రైతులు ఎక్కువగా 64 రకం వంటి లావు బియ్యం పడిస్తుంటారు.

ఇలా ధనిక రైతులు పండించే ఆహారానికి వృధాతో డిమాండు పెరుగుతుంది. ఈ ప్రభావంతో సామాన్యులు ఈ రకం ఆహారానికి దూరమవుతున్నారు.

తద్వారా వారి ప్రభావం కూడా నిరుపేద కుటుంభాలపై పడుతూ వారు ఆహారాన్ని కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది.

ఆకలికి మించి తిన్నా వృధానే…

సాదారణంగా రోగ్యవంతుడైన ఒక్కరి శరీరానికి 4 వందల గ్రాముల ఆహారం ఒక పూటకు సరిపోతుందని శాస్త్రీయంగా తెలిసిన విషయమే.

కానీ తమ ఆకలికి మంచి ఎక్కువ తిన్నా అది శరీరానికి పనికిరాకుండా వృధా అవుతుంది.

అంతే కాకుండా అనారోగ్యాలకు కూడా అతి తిండి కారణమే. కాబట్టి అతి తిండిని తగ్గిస్తే రెండు రకాలుగా ప్రయోజనమే.

కొన్ని నియమాలతో కొంతైనా తేడా…

సాదారణంగా ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని తరువాత పూటకు ఉపయోగించేందుకు తమ ఇంటికి తరలించడం లేదా ఆహారం మిగిలితే దాన్ని సేకరించి తిండి లేని వారికి అందించే ఎన్జీవోలకు సమాచారం ఇవ్వడం వల్ల వారు ఆ మిగిలిన ఆహారాన్ని ఆహారం లేని వారికి అందించేందుకు తరలిస్తారు.

అలాగే ఇంట్లో మిగిలిన ఆహారాన్ని కూడా కొన్ని రోజులు గమనిస్తూ ఎంత వంటను తక్కువ వంట చేస్తే సరిపోతుందని అంచానాకు వచ్చి మిగిలిన ఆహార పదార్థాలను గుర్తిస్తే తేడాను గమనించవచ్చు.

దాన్ని ధానం చేయవచ్చు లేదా తమ కొనుగోలును తగ్గించుకోవచ్చు. అలాగే ప్రభుత్వం ప్రారంభించిన ఫీడ్‌ ది నీడ్‌ ద్వారా మిగిలిన ఆహారాన్ని తిండి లేని వారికి అందించొచ్చు కానీ మొదట్లో చాలా మంది ఈ కార్యక్రమానికి స్పందించినా చాలా చోట్ల తిరిగి ఈ ఫ్రిడ్జ్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి.

ఇక కొత్త సంవత్సర వేడుకలు, పుట్టిన రోజు వేడుకలు వంటివి కూడా ఆహార వృధాకు అదనపు వృధాను పెంచుతున్నాయి.

ఈ ఆహారాన్ని సక్రమంగా వినియోగిస్తే నగరంలో ఉన్న దాదాపు 5 వేల నిరుపేద కుటుంభాలతో పాటు ఏకంగా తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు ఆహారాన్ని అందించవచ్చు.

Read this news…

క్లాక్ ట‌వ‌ర్ల చ‌రిత్ర తెలుసా.. వీటి వెనుక స్వార్థం ఏంటి..

Recent

- Advertisment -spot_img