Curd : పెరుగుతో ఈ పదార్థాలను కలిపి తింటే అనేక లాభాలు
Curd : భారతీయులు ఎంతో కాలం నుంచి పెరుగును ఉపయోగిస్తున్నారు.
చాలా మందికి నిత్యం పెరుగు తిననిదే భోజనం చేసినట్లనిపించదు.
ఇక కొందరైతే పెరుగులో రక రకాల పదార్థాలను వేసి లాగించేస్తుంటారు.
అయితే పెరుగులో కింద సూచించిన విధంగా ఆయా పదార్థాలను కలుపుకుని తింటే.. దాంతో పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఆ పదార్థాలు ఏమిటంటే…
పెరుగులో తరచూ తేనె కలిపి తింటే జీర్ణాశయంలో ఉండే అల్సర్లు మాయమవుతాయి.
జీలకర్ర పొడిని కొద్దిగా తీసుకుని దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తింటే అధిక బరువు తగ్గుతారు.
నల్ల ఉప్పును తీసుకుని పొడి చేసి దాన్ని కొద్ది మోతాదులో పెరుగులో కలిపి తినాలి.
దీంతో గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గించుకోవచ్చు.
పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది.
ఎండ దెబ్బకు గురైన వారు లేదా బాగా శారీరక శ్రమ, వ్యాయామం చేసి అలసిపోయిన వారు ఈ మిశ్రమం సేవిస్తే.. కోల్పోయిన శక్తి వెంటనే లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు.
అలాగే మూత్రం ధారాళంగా వస్తుంది. వేడి తగ్గుతుంది.
పసుపు, కొద్దిగా అల్లం రసం తీసుకుని పెరుగులో కలిపి తింటే శరీరానికి ఫోలిక్ యాసిడ్ అనే పోషకం అందుతుంది.
ఇది చిన్నారులకు, గర్భిణీలకు ఎంతగానో అవసరం.
పెరుగులో వాము కలిపి తినడం వల్ల నోటి పూత, దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి.
నల్ల మిరియాల పొడిని పెరుగులో కలిపి తింటే మలబద్దకం తగ్గుతుంది. ఆహారం బాగా జీర్ణమవుతుంది.
నిత్యం వివిధ రకాల తాజా పండ్లను ముక్కలుగా కట్ చేసి వాటిని పెరుగులో కలిపి తినాలి.
దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పెరుగులో ఓట్స్ కలిపి తింటే శరీరానికి ప్రో బయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి.
పెరుగులో నారింజ పండు రసం కలిపి తింటే శరీరానికి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.
శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.