తెలంగాణ లో ఆర్వోఆర్-2024 బిల్లు త్వరలో చట్టరూపం దాల్చనుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల పోర్టల్ ధరణి స్థానంలో.. ఇక భూభారతి రానుంది. శుక్రవారం శాసనసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించగా.. శనివారం మండలిలో చర్చించిన అనంతరం ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. కాగా ఈ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయగానే.. చట్టం అమల్లోకి వస్తుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.