ఇదేనిజం, కంగ్టి: మానవ మనుగడకు పర్యావరణమే కీలకమని పర్యావరణాన్ని కాపాడుకోవడానికే “స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిఏసిఎస్ డైరక్టర్ కుపెదర్ రెడ్డి, ఎంపీడీఓ సత్యయ ఎంపీఓ సుభాష్ అన్నారు. కంగ్టి మండలంలోని దేగుల్ వాడి గ్రామ పంచాయతీలలో “స్వచ్ఛదనం -పచ్చదనం” కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీలలో గ్రామసభ నిర్వహించి, గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని మన ఇంటి పరిసరాలలో మొక్కలను నాటాలని కోరారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నివారించాలని సూచించారు. వన మహోత్సవ కార్యక్రమం లో మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ రేఖరాణి , బసి రెడ్డి , యువకులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.