ఏపీ, తెలంగాణ కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొనసాగాలన్న పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల అభ్యంతరాలను మోదీ ప్రభుత్వం తిరస్కరించింది. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోజ్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, ఎన్. ప్రశాంతి తదితరులకు రిలీఫ్ ఆర్డర్ జారీ చేశారు.అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎస్‌ఎస్ రావత్, అనంత్ రాము, సృజన, శివశంకర్ లోతేటిలకు కూడా రిలీవ్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిషేక్ మహంతి, అభిలాష్ బిస్త్‌లకు రిలీఫ్ ఆర్డర్లు ఇచ్చారు.ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి సీహెచ్ హరికిరణ్‌కు డీఓపీటీ రిలీఫ్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 16లోగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.