ఫోర్బ్స్ సంస్థ టాప్ 10 బిలియనీర్స్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో మొదటి స్థానంలో 420 బిలియన్ డాలర్లకుపైగా టెస్లా అధినేత ఎలన్‌మస్క్ మొదటి స్థానంలో నిలిచారు. 2వ స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, 3వ స్థానంలో ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్, 4వ స్థానంలో మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, 5వ స్థానంలో LVMH సీఓ, చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్, 6వ స్థానంలో గూగుల్ మాజీ సీఈఓ లారీ పేజ్, 7వ స్థానంలో ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, 8వ స్థానంలో బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్. 9వ స్థానంలో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బామర్, 10వ స్థానంలో ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ ఉన్నారు.