Forbes Top 10 Billionaires: ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని సాధించాడు. 342 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్ సంపద గతేడాదితో పోలిస్తే 147 బిలియన్ డాలర్లు పెరిగింది. యూఎస్ 902 మంది సంపన్నులతో బిలియనీర్ హబ్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎలాన్ మస్క్ పాలనలో సలహాలిస్తున్నాడు.
ఫోర్బ్స్ తాజా టాప్ 10 బిలియనీర్లు వీళ్లే..
- ఎలోన్ మస్క్- $345.6 B.
- జెఫ్ బెజోస్- $208.7 B.
- మార్క్ జుకర్‌బర్గ్- $202.6 B.
- లారీ ఎల్లిసన్ $177.6 B.
- వారెన్ బఫెట్- $166.3 B.
- బెర్నార్డ్ ఆర్నాల్ట్ & కుటుంబం- $161.6 B.
- లారీ పేజ్- $131.3 B.
- సెర్గీ బ్రిన్- $125.8 B.
- స్టీవ్ బాల్మర్- $115.6 B.
- అమాన్సియో ఒర్టెగా- $115.6 B.