ఇదేనిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని కాపాడుకునేందుకు అన్ని కార్మిక సంఘాలతో కలిసి పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా మణిరాం సింగ్, ఉపాధ్యాక్షుడిగా నరసయ్య, సూరిబాబు, రాజమౌళి, జయరాం, ఇతర నాయకులు ఉన్నారు. మణిరాం సింగ్ మాట్లాడుతూ.. ఏరియా ఆసుపత్రిని మూసి వేసేందుకు జీఎం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఆసుపత్రిలోని మెయిన్ మెడికల్ స్టోర్స్ను మూసి వేయించారని మండిపడ్డారు. ఇకనైనా జిఎం , బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ విషయంలో, తమ నిర్ణయాన్ని మానుకోవాలని, ఎన్టీఆర్ హయాంలో కట్టిన ఏరియా హాస్పిటల్, సింగరేణి కార్మికులకు ఒక వరంగా నడుస్తున్న సమయంలో, ఏరియా హాస్పిటల్ ని నామరూపం లేకుండా చేయడం సరైన పని కాదని వారు తెలిపారు. ఇకనైనా హాస్పిటల్ విషయంలో, అన్ని స్పెషాలిటీ ఏర్పాటు చేసి కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.