ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన ఛత్తీస్‌గడ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్‌కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి నంద్ కుమార్ బఘెల్ ఇవాళ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 89 ఏళ్లు. అయితే, బాఘెల్ తండ్రి గత మూడు నెలలుగా ఆనారోగ్యంతో రాయ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులు శోకసంద్రంలో మునిగాయి.